ఆకుమంత్ర బాట కార్యక్రమం కోసం శ్రీ కేబులే పట్టణం గారు స్వయంగా రాసి, గొర్రెలందరి చేతా చేయించిన అడివి ఘోషా ఆకు రొడ్డ ప్రతిజ్ఞ!
అసలే ఎవరూ మన సంస్కృతిని లెక్కచేయడం లేదు,ముందుగా అందరూ సూట్లూ బూట్లూ వేసుకోని, మీ చేతులని గుండెల మీద పెట్టుకోని,అల్లరి చేయకుండా నిల్చోండి..
నా అనాది ఘోష అడవి! నేను నా అడివి ఘోష ను అఘోరించబోతున్నాను. అన్ని అడవి జాతులను
,జంతువులను,అంతరించిపోతున్న ఆదిమ జాతిని తెరపైకి తీసుకు వస్తున్న జేమ్స్ కామెరూన్‌ను, అడవి జంతువుల్లా బట్టలేసుకోకుండా ఎగిరే షకీలాను, కేట్ విన్స్లేట్ను ఏటువంటి నిబంధనలు లేకుండా గౌరవిస్తాను, ఆరాధిస్తాను. అడవి లో ఉన్న అన్ని ఆకులు అలములు నాకు ఆహారమే !
అడవి రొడ్డ ఉన్న అన్ని పొలాలోనూ ఆకుమంత్రమే వ్యవహారంలో ఉండటానికి నేను అంగీకరించి, కృషి మాత్రం చెయ్యను. నేను నా ఆడంగులతో, అడవివారితో ఎల్లప్పుడూ అడవి ఘోషలోనే అఘోరిస్తాను.
పాము కరిచిన వారికి గడ్డితోనే ఆకుమంత్రం వేస్తాను. ఆకుమంత్రం రానివారికి అది నేర్చుకోవడానికి నా దగ్గర ఉన్న గడ్డితో ఇతోధిక సహకారాన్ని అందజేయను.అడవి రొడ్డకు,ఆకుమంత్ర వారసత్వానికీ ఎక్కడా, ఏ సందర్భంలోనూ, ఎవరి వలనా అవమానం జరగకుండా అన్ని విధాలుగా ముందుగా నేనే అవమానిస్తాను.
ఆకు మంత్ర గురించిన సరియైన పరిజ్ఞానాన్ని సంపాదించే నిమిత్తం ప్రేరణ ప్రోత్సాహాలు కలుగజేస్తాను.నా ఆకుమంత్ర వారసత్వాన్ని భావి తరాలకు యథా తథంగా, ఏ విధంగా బాగుపడకుండా అందించడానికి ఉద్దేశించిన ప్రతి కార్య కలాపానికీ నా మద్దతు ప్రకటిస్తాను, ఇంట్లో తొంగుంటాను.
రెండున్నార వేల సంవత్సరాల చరిత్ర,సంస్కృతి,సాహిత్య సంప్రదాయమూ కలిగిన ఆకుమంత్ర రొడ్డా వారసత్వం నాకు చాలా గర్వ కారణం! ఈ వారసత్వాన్ని సగర్వంగానూ,బహిరంగంగానూ కబ్జా చేసుకోవడం నా కర్తవ్యం! శాయశక్తులా దాన్ని నిలబెట్టుకోవడానికి నిద్దరోవడం నా విధ్వక్ ధర్మం!
జై ఆకుమంత్ర అడవి రొడ్డతి!
7 కామెంట్లు:
తాడేపల్లిగారిని ఇలా అవమానించడం పద్దతిగా లేదు. దయచేసి దీన్ని తీసివేయండి
ఇప్పటికి పై టపా ఇరవై సార్లు చదివినా ఒక్క ముక్క అర్ధం కాలేదు కానీ పై అజ్ఞాత గారి వాఖ్యతో అర్ధం అయింది.
Not funny not even sarcastic. Not sure what is intention of writing this. If its to insult/immitate Tadepallygaru you are doing mistake.
బెండు అప్పారావు అనౌన్స్ చేసిన బ్లాగ్ ఇదేనా?
అస్సలు ఏంటో ఒక్క ముక్క అర్థం కాలేదు
అర్ధమైపొతే రాం గోపాల వర్మ సినిమా ఎట్టా అవుద్ది
www.linxdown.com/3f6/lc/mestri+movie+torrent
సినిమా చూసి అభిప్రాయం చెప్పండి
అందరు తెలుగు
కవులను,కళాకారులను ,రచయితలను నేను బేషరతుగా గౌరవిస్తాను == బట్టలేసుకోకుండా ఎగిరే షకీలాను, కేట్ విన్స్లేట్ను ఏటువంటి నిబంధనలు లేకుండా గౌరవిస్తాను.
అన్ని రంగాలలోనూ తెలుగే వ్యవహారంలో ఉండటానికి నేను అంగీకరిస్తున్నాను == వ్యవహారంలో ఉండటానికి నేను అంగీకరించి, కృషి మాత్రం చెయ్యను. (నా బోడి అంగీకారం ఎందుకో)
యథా తథంగా అందించడానికి ఉద్దేశించిన ప్రతి కార్య కలాపానికీ నా మద్దతు ప్రకటిస్తాను. == ఉద్దేశించిన ప్రతి కార్య కలాపానికీ నా మద్దతు ప్రకటిస్తాను, ఇంట్లో తొంగుంటాను.(నా బోడి మద్దతు ఎందుకో)
ఈ వారసత్వాన్ని సగర్వంగానూ,బహిరంగంగానూ
ప్రకటించుకోవడం నా కర్తవ్యం! == కబ్జా చేసుకోవడం నా కర్తవ్యం?
శాయశక్తులా దాన్ని నిలబెట్టడానికి కృషి చేయడం నా విధ్యుక్త ధర్మం! == ( దాన్ని == దేన్ని వారసత్వాన్నా?) నిద్దరోవడం నా విధ్వక్ ధర్మం!
కామెంట్‌ను పోస్ట్ చేయండి